గదర్ ఈజ్ బ్యాక్ అంటున్న ఫ్యాన్స్
on Jun 13, 2023
పాకిస్తానీ అల్లుడు సన్నీడియోల్ అలియాస్ తారా సింగ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు ఫ్యాన్స్. సూపర్ హిట్ సినిమా గదర్: ఏక్ ప్రేమ్ కథకి సీక్వెల్ అనౌన్స్ అయినప్పటి నుంచే ఫ్యాన్స్ లో బజ్ మొదలైంది. గదర్2 సెట్స్ నుంచి పిక్స్ రిలీజ్ అయిన ప్రతిసారీ ప్రేక్షకులకు మరింత ఆసక్తిని క్రియేట్ చేసేవి. ఇప్పుడు విడుదలైన టీజర్‌కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సన్నీడియోల్, అమీషా పటేల్ జంటగా నటించిన ఫస్ట్ పార్ట్ ని ఇటీవల థియేటర్లలో విడుదల చేశారు. ఫస్ట్ పార్ట్ మళ్లీ చూసిన వారు సీక్వెల్ టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేశారు. టీజర్ 1971 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. మ్యాచో స్టార్ సన్నీ డియోల్ సినిమాలో తారా సింగ్‌గా మెప్పిస్తున్నారు. బాగా పెరిగిన బ్రౌన్ గడ్డం, కుర్తా పైజామా, మెడ చుట్టూ టర్బన్‌తో కనిపించారు సన్నీడియోల్. టీజర్‌లో సకీనా (అమీషా పటేల్) కనిపించలేదు. పాపులర్ సాంగగ్ ఉద్ జ కాలే కవా పాట మాత్రం ఎండింగ్‌లో వినిపించింది.
గదర్ 2 ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ ఏడాది జనవరి 23న విడుదలైంది. ఆగస్టు 11న ఈ సినిమా విడుదల కానుందని అనౌన్స్ చేశారు సన్నీడియోల్. హిందుస్తాన్ జిందాబాద్ హై.. జిందాబాద్ థా.. ఔర్ జిందాబాద్ రహేగా! ఈ ఇండిపెండెన్స్ సందర్భంగా భారతదేశం ఎదురుచూస్తున్న అతి పెద్ద సీక్వెల్ గదర్2 రిలీజ్ చేస్తాం. రెండు దశాబ్దాల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్‌ని ఆదరిస్తారని నమ్ముతున్నా`` అని అన్నారు. ఆగస్టు 11న నార్త్ ఇండియాలో యానిమల్ సినిమా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన యానిమల్‌కి మంచి స్పందన వస్తోంది. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించారు యానిమల్ సినిమాలో. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. తెలుగులో ఇదే డేట్‌కి భోళా శంకర్ రిలీజ్ కానుంది. చిరంజీవి హీరోగా, తమన్నా హీరోయిన్‌గా, కీర్తీ సురేష్ చెల్లెలుగా నటించిన సినిమా భోళా శంకర్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
